బీఆర్ఎస్ నేత హత్య.. KTR ఆరోపణలపై మంత్రి జూపల్లి సీరియస్

by Rajesh |
బీఆర్ఎస్ నేత హత్య.. KTR ఆరోపణలపై మంత్రి జూపల్లి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: కొల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధి చిన్నంబావి మండలం లక్ష్మీ పల్లి గ్రామంలో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ అంశం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పొలిటికల్ వార్‌కు దారి తీసింది. హత్యా రాజకీయాలు తగవంటూ కేటీఆర్ ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలని.. మంత్రి జూపల్లిని బర్తరఫ్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. స్వయంగా వెళ్లి బీఆర్ఎస్ నేత అంత్యక్రియల్లో ఆయన పాల్గొన్నారు. ఇక, ఈ వివాదంపై శుక్రవారం మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు.

ఉనికి కోసమే బీఆర్ఎస్ శవరాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. భూతగాదాలు, ఆర్థిక లావాదేవీలే శ్రీధర్ రెడ్డి హత్యకు కారణమన్నారు. విచారణలో ఏమి తేలకుండానే బట్టకాల్చి మీద వేయడం ఏంటని సీరియస్ అయ్యారు. తన ప్రతిష్టను దెబ్బతీసి తద్వారా బీఆర్ఎస్ మైలేజ్ పెంచుకోవాలని చూస్తున్నారన్నారు. జూపల్లిని బర్తరఫ్ చేయాలని కేటీఆర్ అంటున్నారని.. మీరు నన్ను బర్తరఫ్ చేశాకే ప్రజలు మిమ్మల్ని బర్తరఫ్ చేశారని కౌంటర్ ఇచ్చారు. వాస్తవాలు తెలుసుకోకుండా చాన్స్ దొరికిందని బురదజల్లే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.

Next Story