Tirumala Samacharm: తిరుమలలో భక్తజన సందోహం.. సర్వదర్శనానికి 22 గంటల సమయం

by Shiva |
Tirumala Samacharm: తిరుమలలో భక్తజన సందోహం.. సర్వదర్శనానికి 22 గంటల సమయం
X

దిశ, వెబ్‌డెస్క్: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిథి తిరుమల క్షేత్రం భక్త జన సందోహంతో కిక్కిరిసిపోయింది. గురువారం, శ్రీవారిని దర్శించుకునేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 22 గంటల సమయం పడుతోంది. గత వారం రోజుల నుంచి తిరుమల వీధులు అన్ని భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. వసతి గృహాలు దొరకక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమల క్షేత్రానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. మరోవైపు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు స్వామి వారి దర్శనానికి పోటెత్తారు. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వ దర్శనానికి కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్ కొనసాగుతోంది. శనివారం స్వామి వారిని 65,416 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 36,128 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.51 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Read More..

టీటీడీ కీలక నిర్ణయం..ఆ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Next Story