మీ జర్నీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.. మోడీకి స్టార్ హీరోల స్పెషల్ విషెస్.. వైరల్‌గా మారిన పోస్టులు

by Mallepaka Hamsa |

నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

మీ జర్నీ ఎంతోమందికి  స్ఫూర్తిదాయకం.. మోడీకి స్టార్ హీరోల స్పెషల్ విషెస్.. వైరల్‌గా మారిన పోస్టులు
X

దిశ, సినిమా: నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఆయనకు విషెస్ తెలుపుతూ టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు సోషల్ మీడియా ద్వారా వీడియోలు షేర్ చేస్తున్నారు. నెట్టింట ఎక్కడ చూసిన మోడీకి సంబంధించిన పోస్టులే దర్శనమిస్తున్నాయి. ఇక మోడీకి విష్ చేస్తూ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, హీరో మాధవన్, కోలీవుడ్ స్టార్ రజినీకాంత్ ట్వీట్లు పెట్టారు.

*మన గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన చూపిస్తున్న నాయకత్వం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాను. మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు దేశం అభివృద్ధికి దోహదపడుతుంది.

మహేష్ బాబు (లింక్)

*మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. భారతదేశ అభివృద్ధికి మీరు చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. ఈ సంతోషకరమైన సందర్భంగా, మీరు దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను. దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లాలని మేము ప్రార్థిస్తున్నాము.

ఆమిర్ ఖాన్ (వీడియో)

*ఈ రోజు, ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా, ఆయనకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న నగరం నుండి ప్రపంచ వేదికకు మీ ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ ప్రయాణంలో మీ క్రమశిక్షణ, కృషి, దేశం పట్ల అంకితభావం కనిపిస్తాయి. 75 సంవత్సరాల వయస్సులో మీ శక్తి మనలాంటి యువతను కూడా అధిగమిస్తుంది. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.

షారుఖ్ ఖాన్ (వీడియో)

*మోడీకి జన్మిదిన శుభాకాంక్షలు. మీరు ఎప్పుడే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. దేశాన్ని ముందుకు నడిపే శక్తిని భగవంతుడు మీకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.

రజినీకాంత్ (ట్వీట్)

*నా సినిమా రాకెట్రీ కోసం సిద్ధమవుతున్నప్పుడు మోడీ జ్ఞాపకశక్తిని నేను ఆశ్చర్యపోయాను. ‘ఉరి’ విడుదలై భారీ విజయం సాధించిన వెంటనే ఇది జరిగింది. మోడీ జీ ముంబైలో ఒక కార్యక్రమానికి వచ్చారు. అక్కడ సినీ పరిశ్రమ నుండి చాలా మంది గుమిగూడారు. అందరూ ఆయనను కలవడానికి ఫోటోలు తీయడానికి ఆసక్తిగా ఉన్నారు. నేను కూడా అక్కడే ఉన్నాను. ఇబ్బంది పెట్టడం ఎందుకని దూరంగా ఉన్నాను. నేను ప్రధాన పాత్రలో నటిస్తున్న గొప్ప శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీ పూర్తి లుక్‌లో ఉన్నాను. పెద్ద గడ్డం, పూర్తి మేకప్‌తో, మోడీ జీ నన్ను గుర్తుపట్టగలరా అని అనుకున్నాను కానీ గుర్తుపట్టారు. ప్రతి ఒక్కరికీ విలువిచ్చే వ్యక్తిని ఇప్పటి వరకు చూడలేదు.

మాధవన్ (వీడియో)

*గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. భారతదేశాన్ని పురోగతి, కీర్తి ఉన్నత శిఖరాల వైపు నడిపించడానికి మీకు మంచి ఆరోగ్యం, బలం, జ్ఞానం ఉండాలని కోరుకుంటున్నాను.

మెగాస్టార్ చిరంజీవి (ట్వీట్)

*మోడీ గారు 75వ పుట్టినరోజును సమీపిస్తున్న తరుణంలో, 2014లో ఆయనతో నా తొలి సమావేశాన్ని గుర్తుచేసుకుంటున్నాను. అది ప్రేరణ, దయ జీవితానికి పాఠాల నేర్చిన క్షణం. ఆయన మంచి ఆరోగ్యం, నిరంతర నాయకత్వం కోసం ప్రార్థిస్తున్నాను.

నాగార్జున (ట్వీట్)

Next Story