- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిరంజీవికి షూ వేసిన యంగ్ హీరోయిన్.. వైరల్ వీడియోపై నెటిజన్లు ఫైర్
యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్(Samyuktha Menon) ‘కాటమరాయుడు’’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్(Samyuktha Menon) ‘కాటమరాయుడు’’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి మూవీనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేయడంతో మంచి పాపులారిటీ దక్కింది. ఇక ఆ తర్వాత ‘వీరూపాక్ష’ లోనూ నటించగా.. ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేసింది. ఘన విజయం సాధించడంతో పాటు సంయుక్త నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి. అలాగే కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది. ఈ అమ్మడు నటించిన ‘సార్’ కూడా విజయం సాధించింది. దీంతో క్రేజీ బ్యూటీగా మారిన ఆమె తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం సంయుక్త మీనన్ తెలుగులో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనుంది. ఈ మూవీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనుండగా.. ఇందులో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు.
సంయుక్త మీనన్ ఈ సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ‘అఖండ-2’ (Akhanda-2)లోనూ కీలక పాత్రలో కనిపించనుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, హైదరాబాద్‌లో ఫినిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసి బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌లో సంయుక్త పాల్గొంది. అలాగే ఆమెతో పాటు చిరంజీవి పాల్గొని పలు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అసలు అందులో ఏముందంటే.. వెళ్లే ముందు చిరుకి షూస్ వేస్తూ కనిపించింది. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ కావడంతో అది చూసిన నెటిజన్లు కొందరు పాజిటివ్‌గా రియాక్ట్ అవుతూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు మాత్రం చిరంజీవిపై మండిపడుతున్నారు. ఓ హీరోయిన్‌తో అలా చేయించుకోవడమేంటని అంటున్నారు. అలాగే హీరోయిన్‌ను కూడా తిడుతున్నారు.






