- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో వివాదంలో పెద్ది సినిమా..షాక్ లో ఫ్యాన్స్!
రామ్ చరణ్ నటించిన పెద్ది మరో వివాదంలో చిక్కుకుంది.

దిశ, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. నాలుగు రోజుల కిందట రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కథ జనాలకు కాస్త కనెక్ట్ అయిన నేపథ్యంలో జనాలు ఎగబడి థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ఈ మూవీ ఇప్పటికే రాబట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో పెద్ది సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే బాలీవుడ్ భామ జాన్వీ పాత్రపై కాంట్రవర్సీ చోటు చేసుకుంది. ఇక లేటెస్ట్ గా గిరిజనులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని తెరపైకి మరో వివాదం వచ్చింది. ఈ నేపథ్యంలో విజయనగరం కలెక్టర్, ఎస్పీకి ఆదివాసీ సంఘాలు ఫిర్యాదు కూడా చేశాయి. చిత్ర బృందంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
అసలు వివాదం ఏంటి ?
రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాలో గిరిజనులను కించపరిచేలా పలు సన్నివేశాలు, డైలాగ్స్ ఉన్నాయని ఆరోపణలు చేస్తూ విజయనగరంలోని పలు ఆదివాసీ సంఘాలు సీరియస్ అవుతున్నాయి. సినిమాలో సుమారు 15 సందర్భాలలో తమను అవమానించేలా పదజాలం వాడారని పేర్కొంటున్నారు. ఆ వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని విజయనగరం జిల్లా కలెక్టర్, ఎస్పీలకు గిరిజన సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. ఈ పెద్ది సినిమాలో ఆదివాసీలను కించపరిచేలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్నప్పటికీ... సెన్సార్ బోర్డు చర్యలు తీసుకోకపోవడం దారుణం అంటూ ఫైర్ అవుతున్నారు. రామాయణం, మహాభారతాలలో తమ పూర్వీకులు కీలక పాత్ర పోషించాలని... అలాంటి తమనే కించపరిస్తే ఎలా అంటూ నిలదీస్తున్నారు.






