బ్యాట్ బౌల్ తో విజృంభించిన అర్జున్ టెండూల్కర్.. ప్రశంసల జల్లు

by Malleboina Mahesh |

ముంబై టీ20 లీగ్‌లో అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు. 3 వికెట్లు తీయడంతో పాటు 34 బంతుల్లో 66 పరుగులు చేసి ఒంటిచేత్తో తన జట్టను గెలిపించారు.

బ్యాట్ బౌల్ తో విజృంభించిన అర్జున్ టెండూల్కర్.. ప్రశంసల జల్లు
X

దిశ, వెబ్ డెస్క్: భారత క్రికెట్ గాడ్ అయిన సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) గత కొద్ది సంవత్సరాలుగా వివిధ లీగ్ లో ఆడుతూ వస్తున్నాడు. సొంత కష్టాన్ని నమ్ముకొని పైకి రావాలని చూస్తున్న యువ ప్లేయర్ కు ఐపీఎల్ 2026 లో ఆశించిన అవకాశమే రాలేదు. కానీ ఐపీఎల్ తర్వాత ముంబై టి20 లీగ్‌ (Mumbai T20 League)లో యువ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ కు మంచి అవకాశం దక్కింది. దీంతో అతను సంచలన ప్రదర్శనతో అదరగొట్టారు. బాంద్రా బ్లాస్టర్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అంధేరి టీమ్ (Andheri Team) తరపున బరిలోకి దిగిన అర్జున్.. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో అద్భుతమైన ఆల్‌రౌండ్ షోతో జట్టును ఒంటిచేత్తో మ్యాచును గెలిపించారు. మొదట బౌలింగ్‌లో ప్రత్యర్థి జట్టును కట్టడి చేసిన ఆతను.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయారు.

బౌలింగ్‌లో మూడు వికెట్లు.. బ్యాటింగ్‌లో సిక్సర్ల వర్షం

ఈ మ్యాచ్‌లో మొదట బౌలింగ్ చేసిన అర్జున్ టెండూల్కర్ 3 ఓవర్లు మాత్రమే వేసి, 11 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టారు. అనంతరం బాంద్రా బ్లాస్టర్స్ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్య ఛేదనలో అంధేరి జట్టు తరపున అర్జున్ బ్యాటింగ్‌లో శివతాండవం చేశారు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 34 బంతుల్లోనే 5 అద్భుతమైన సిక్సర్లు, 4 ఫోర్ల సహాయంతో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. మరో ఎండ్‌లో ముషీర్ ఖాన్ (54*) కూడా రాణించడంతో, వీరిద్దరూ కలిసి కేవలం 13.5 ఓవర్లలోనే జట్టుకు ఘన విజయాన్ని అందించారు. అసాధారణమైన ఈ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు గాను అర్జున్ టెండూల్కర్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును కైవసం చేసుకున్నారు. దీంతో అతనిపై సీనియర్ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Next Story