- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో యంగ్ హీరోయిన్ ఫిక్స్.. లీక్ అయిన ఫొటోలు
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో భారీ ప్రాజెక్ట్ రానుంది.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో భారీ ప్రాజెక్ట్ రానుంది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ (ManaShankaraVaraPrasadGaru)టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంలో నయనతార(Nayanthara) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ షైన్ స్క్రీన్ బ్యానర్‌పై అర్చన సమర్పణలో సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తు్న్నారు. భీమ్స్ సీసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాలో నయనతారతో పాటు ఓ యంగ్ హీరోయిన్ నటిస్తోంది.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ వంటి భాషల్లో ఎన్నో చిత్రాలు చేసిన క్యాథరిన్ థ్రెసా ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీలో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించనప్పటికీ.. అనుకోకుండా.. షూటింగ్ ఫొటోలు లీక్ కావడంతో ఈ విషయం కాస్త బయటకు వచ్చింది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సెట్‌లోకి ప్రముఖ క్రికెటర్ తిలక్ వర్మ వెళ్లగా చిరు సన్మానించారు. ఇక ఫొటోల్లో కెథరిన్ కూడా ఉండటం విశేషం. ఈ అమ్మడు షూటింగ్‌లోనూ పాల్గొన్నట్లు తెలుసుకున్న మెగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.






