63 ఏళ్ల స్టార్ హీరోతో యంగ్ బ్యూటీ డేటింగ్.. హాట్ టాపిక్‌గా మారిన పోస్ట్.. నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడా?

by Mallepaka Hamsa |

సినీ ఇండస్ట్రీలో నటీనటులు డేటింగ్ చేసుకోవడం కామన్ అయిపోయింది.

63 ఏళ్ల స్టార్ హీరోతో యంగ్ బ్యూటీ డేటింగ్.. హాట్ టాపిక్‌గా మారిన పోస్ట్.. నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడా?
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో నటీనటులు డేటింగ్ చేసుకోవడం కామన్ అయిపోయింది. డేటింగ్‌లో కొద్ది కాలం పాటు ఎంజాయ్ చేసిన తర్వాత కొంతమంది తమ బంధాన్ని బలపరుచుకునేందుకు పెళ్లి కూడా చేసుకుంటారు. మరికొందరు మాత్రం మధ్యలోనే విడిపోతుంటారు. అలాగే కొంతమంది పెళ్లి తర్వాత కూడా మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోతుంటారు. అలా ఇటీవల స్టార్ హీరోలు రెండు మూడు పెళ్లిళ్లు కూడా చేసుకుని విడాకులు ఇస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, హాలీవుడ్ స్టార్ హీరో 63 ఏళ్ల వయసులో యంగ్ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే... హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్(Tom Cruise) ఆరోసారి ప్రేమలో పడినట్లు చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని వారికి విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత ఓ మహిళతో రిలేషన్‌షిప్ మెయింటేన్ చేసిన ఆయన ఇక ఇప్పుడు ఓ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు టాక్.

37 ఏళ్ల అనా డీ అర్మాస్‌(Ana de Armas)తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరు వెర్మోంట్‌లో చేతిలో చేయి వేసుకుని నడుస్తూ కనిపించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అవి కాస్త డేటింగ్ వార్తలకు బలం చేకూరేలా చేశాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ వీరిద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలిచనప్పటికీ వీరి ఫొటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కాగా, టామ్ క్రూజ్ 1987లో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు కేవలం మూడేళ్లకే విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత 1990లో రెండో సారి వివాహం చేసుకోగా.. 11 ఏళ్లు కాపురం చేశాక విడిపోయాడు. ఇక 2006లో మూడోసారి పెళ్లి చేసుకోగా.. 6 ఏళ్ల తర్వాత విడాకులు అయ్యాయి.

link

Next Story