- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంపర్ ఆఫర్ అందుకున్న యంగ్ బ్యూటీ.. సూపర్ ఎగ్జైటెడ్‌గా ఉన్నానంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్
తమిళ బ్యూటీ అమ్ము అభిరామి(Ammu Abirami) ‘భైరవ’ సినిమాతో ఇండస్ట్రీకి రాగా.. ఫుల్ ఫేమ్ దక్కించుకుంది.

దిశ, సినిమా: తమిళ బ్యూటీ అమ్ము అభిరామి(Ammu Abirami) ‘భైరవ’ సినిమాతో ఇండస్ట్రీకి రాగా.. ఫుల్ ఫేమ్ దక్కించుకుంది. ఇక ఆ తర్వాత తీరన్ అకా హమీర్ ఉడు,అసురన్, రాక్షసన్ వంటి హిట్ చిత్రాల్లో నటించిన అమ్ము అనతి కాలంలోనే తన పాపులారిటీని పెంచుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది. తాజాగా, అమ్ము అభిరామి ఓ బంపర్ ఆఫర్ అందుకుంది. రాజ్ తరుణ్(Raj Tarun) సరసన రొమాన్స్ చేయనుంది. అలాగే నటుడు కిశోర్ కూడా ఇందులో జాయిన్ అయినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ అమ్ము ఇన్‌స్టాగ్రామ్ ద్వారా టీమ్ పెట్టిన పోస్ట్ షేర్ చేసింది. ‘‘ఈ సినిమాలో చేరడం సూపర్ ఎక్జైటెడ్‌గా ఉంది.
ఎప్పటికీ మనోహరంగా ఉండే అమ్ము అభిరామికి హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాము. మిమ్మల్ని ఈ కార్యక్రమంలో చేర్చడం చాలా ఆనందంగా ఉంది. టైటిల్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నాం’’ అనే క్యాప్షన్ జత చేశారు. అయితే యాక్షన్ ప్యాక్‌డ్ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను విజయ్ మిల్టన్(Vijay Milton) తెరకెక్కిస్తున్నారు. ఇక ఇందులో సునీల్, భరత్, ఆరి అర్జునన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతోనే రాజ్ తరుణ్ తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే దీనిని రఫ్‌నోట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కాలేదు. నటీనటుల ఎంపిక విషయంలో మాత్రం టీమ్ జాగ్రత్తగా ఉన్నారు.






