పెళ్లి పీటలెక్కబోతున్న యంగ్ హీరో విశ్వక్‌సేన్.. ఆగష్టు 15 కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

by Disha Web Desk 9 |
పెళ్లి పీటలెక్కబోతున్న యంగ్ హీరో విశ్వక్‌సేన్.. ఆగష్టు 15 కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేక్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తనదైన స్టైల్ అండ్ స్వాగ్‌తో టాలీవుడ్‌లో సపరేట్ ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. చేసింది కొన్ని సినిమాలే అయినా ప్రేక్షకులు అద్భుతంగా ఆయన్ను ఆదరించారు. ఇటీవల ‘ధమ్కీ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. చాలా రోజుల తర్వాత ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించి, హీరోగా నటించారు. అయితే, ఇదిలా ఉండగా.. అభిమానులకు విశ్వక్ సేన్ క్రేజ్ న్యూస్ చెప్పారు.

అతి త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. “ఇన్నాళ్లు నాపై ప్రేమ చూపించే అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇక ఇప్పుడు మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నా జీవితంలోని మరో ఘటాన్ని నేను ప్రారభించబోతున్నాను. నేను కుటుంబాన్ని మొదలుపెట్టబోతున్నాను. ఆగష్టు 15న పూర్తి వివరాలు తెలియజేస్తాను” అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. మాస్ కా దాస్‌ని వరించబోయే ఆ వధువు ఎవరో అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Next Story