‘బెంజ్’ సినిమాలో యంగ్ బ్యూటీ ఫిక్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-10 17:34:40  IST  )

డాన్స్ మాస్టర్‌గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్(Raghava Lawrence) హీరోగా మారాడు.

‘బెంజ్’ సినిమాలో యంగ్ బ్యూటీ  ఫిక్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న ట్వీట్
X

దిశ, సినిమా: డాన్స్ మాస్టర్‌గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్(Raghava Lawrence) హీరోగా మారాడు. కాంచన, శివలింగ, ముని వంటి చిత్రాలతో ఫుల్ ఫేమ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బెంజ్’. ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో సంయుక్త మీనన్, ప్రియాంక మోహన్(Priyanka Mohan) హీరోయిన్లుగా నటిస్తుండగా.. మలయాళ స్టార్ నటుడు నివిన్ పౌలీ విలన్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘బెంజ్’ సినిమాలో మరో యంగ్ బ్యూటీ జాయిన్ అయినట్లు సమాచారం.

ఇందులో యంగ్ హీరోయిన్ మడోన్న స్టెబాస్టియన్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అమ్మడు షూటింగ్‌లో పాల్గొని పలు సీన్స్‌ను కూడా పూర్తి చేసిందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక అవి చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా, మడోన్న ‘ప్రేమమ్’ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఇక ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఆమె ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. చివరగా దళపతి విజయ్ ‘లియో’ మూవీతో హిట్ అందుకుంది. ఇప్పుడు మళ్లీ ‘బెంజ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Next Story