‘జటాధర’లో నాలోని కొత్త కోణాన్ని చూడబోతున్నారు: సోనాక్షి సిన్హా

by Mallepaka Hamsa |

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న లేటెస్ట్ సినిమా ‘జటాధర’(Jatadhara).

‘జటాధర’లో నాలోని కొత్త కోణాన్ని చూడబోతున్నారు: సోనాక్షి సిన్హా
X

దిశ, సినిమా: సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న లేటెస్ట్ సినిమా ‘జటాధర’(Jatadhara). బలమైన భావోద్వేగాలు, స్టన్నింగ్ విజువల్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సుధీర్ బాబు (Sudheer Babu)హీరోగా నటించారు. శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో కనిపించనుంది. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. షూటింగ్ పూర్తిచేసుకున్న ‘జటాధర’ నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో థియేటర్స్‌లోకి రానుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన సోనాక్షి ఆసక్తి పెంచింది.

‘‘నేను ఇలాంటి పాత్ర చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఇది నేను ఇంతకు ముందు చేసిన వాటికంటే పూర్తిగా భిన్నంగా ఉండబోతుంది. అందుకే నాకు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. నన్ను ఇలాంటి పాత్రలో ఊహించుకుని దానికి ప్రాణం పోసినందుకు నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొందరు నన్ను బీహార్ కి బేటీ అని కూడా పిలుస్తున్నారు. కానీ నాన్న ఎప్పుడూ, నువ్వు హిందూస్తాన్ కి బేటీ అని అనేవారు. 'నువ్వు ఏ రాష్ట్రానికి చెందిన పాత్రను పోషిస్తే నువ్వు అందులో కలిసిపోతావు' అని ఆయన అనేవారు.

నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూపించని నాలోని ఒక కోణాన్ని చూడబోతున్నారు. ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడటానికి.. నేను నిజంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ‘జటాధర’ సెట్‌లో నాకు లభించిన గౌరవం నన్ను నిజంగా కదిలించింది. టీమ్ అంతా చాలా మంచి వారు. నాకు ముఖ్యంగా నచ్చిన విషయం ఏంటంటే.. ఉదయం 9 గంటలకు మొదలైన షూటింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగించేవారు. ప్రతిదీ టైమ్‌కి నిర్వహించారు. మొదట్లో కొంచెం భాషా అవరోధం ఉండేది కానీ ఆ తర్వాత అలవాటు అయిపోయింది. నిజంగా ఇది ఒక అందమైన అనుభూతి’’ అని చెప్పుకొచ్చింది.

Next Story