బాలకృష్ణతో నటించిన ఈ పిల్లలు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు.

by Dishafeatures1 |
బాలకృష్ణతో నటించిన ఈ పిల్లలు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు.
X

దిశ,సినిమా:1974 లో తాతమ్మ కల అనే సినిమాతో నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ తనకంటూ ఒక క్రేజ్ ని సంపాదించుకున్నాడు. బాలయ్య బాబుగా అందరి మనసులను గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్‌ని ఇచ్చారు. అయితే బాలకృష్ణతోపాటు అతని సినిమాలో నటించే యాక్టర్స్‌కి మంచి గుర్తింపు దక్కుతూ ఉంటుంది. అలా చాలామంది చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్‌గా మారుతారు. అలా గుర్తింపు పొందిన వారిలో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, తరుణ్, అఖిల్, మీనా, రాశీ, హన్సిక, షాలిని, లయ ఉన్నారు. ఇక ఎప్పుడు ఎవరు ఎంత గొప్పగా ఎదుగుతారో మాత్రం అస్సలు ఊహించలేమనే చెప్పాలి.

ఇక అసలు విషయానికి వస్తే దర్శకుడు కోడి రామకృష్ణ, బాలకృష్ణ కాంబినేషన్ అంటే మామూలుగా ఉండేది కాదు. అలా వారి కాంబోలో 6 సినిమాలు వరుసగా 100 రోజులు ఆడాయి. అలాగే కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘బాలగోపాలుడు’ చిత్రంలో నటి సుహాసిని హీరోయిన్‌గా, బాలకృష్ణ హీరోగా నటించగా.. కళ్యాణ్ రామ్, రాశీ ఇద్దరు కూడా బాల నటులుగా నటించారు. వీరిద్దరూ అన్నా, చెల్లెలు‌గా నటించిన ఈ సినిమా థియేటర్లో 100 రోజులు ఆడింది. ఇందులో నటించి వీరు ఇప్పుడు ఎంత గొప్ప నటులో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


Next Story

Most Viewed