డివోర్స్ తీసుకున్న బాధ లేకుండా.. శ్రీజ కుమార్తే బర్త్డే పార్టీలో ఎంజాయ్ చేసిన నిహారిక!

by Disha Web Desk 9 |
డివోర్స్ తీసుకున్న బాధ లేకుండా.. శ్రీజ కుమార్తే బర్త్డే పార్టీలో ఎంజాయ్ చేసిన నిహారిక!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గురించి సుపరిచితమే. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన పిల్లలకు సంబంధించిన, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను, అనుభవాలను ఈమె పంచుకుంటారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ తార 4 లక్షలకు పైగా ఫాలోవర్స్‌ను కూడా సొంతం చేసుకుంది. అయితే శ్రీజ మొదటగా శిరీష్‌ను పెళ్లి చేసుకుని.. నివృతికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. జులై 5 తన 15వ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. ఆ రోజు మెగా కుటుంబంతో పాటు తన స్నేహితులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ రోజు సాయంత్రం ఘనంగా జరిగిన నివృత్తి బర్త్డే పార్టీలో నిహారిక కూడా హాజరై సందడి చేశారు. శ్రీజ కుమార్తెతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట షేర్ చేశారు. దీంతో నెటిజన్లు విడాకుల విషయంలో ఏ మాత్రం బాధ లేదుగా మెగా డాటర్‌కు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read More..

Niharika Konidela జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోతుందని నాకు ముందే తెలుసు : వేణు స్వామి..







Next Story

Most Viewed