- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ లేకపోతే అంతా శూన్యం అంటూ త్రిష ఎమోషనల్ పోస్ట్.. ఆ వ్యక్తి కోసమేనా?
ప్రేమ అనేది సర్వస్వం కాదు, కానీ అది లేకుండా అంతా శూన్యం.

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ త్రిష గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలపై వస్తున్న వరుస పుకార్లతో వార్తల్లో నిలుస్తున్న ఈ చెన్నై అందం, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన కొన్ని పోస్ట్‌లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. "ప్రేమ అనేది సర్వస్వం కాదు, కానీ అది లేకుండా అంతా శూన్యం" అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ పోస్ట్ చూసిన వారంతా ఆమె ఎవరితోనో ప్రేమలో ఉందని అందుకే ఇలాంటి పోస్ట్ పెట్టిందని అంటున్నారు. దీనితో పాటు ఆమె పంచుకున్న రెండు వీడియో కోట్స్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాను ఇప్పుడు జీవితంలో ఒక కొత్త దశలోకి ప్రవేశించానని, అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటమే తన ప్రస్తుత సూత్రమని ఆమె పేర్కొన్నారు. "జీవితంలో నేను ఇప్పుడు ఎవరితోనూ వాదించని స్థితిలో ఉన్నాను. ఒకవేళ మీరు ఏనుగు ఎగురుతుందని చెబితే.. అవును మీరు చెప్పింది నిజమే అని చిరునవ్వుతో ఒప్పేసుకుంటాను.
ఎందుకంటే మిమ్మల్ని ఒప్పించేంత ఓపిక, ఆసక్తి నాకు లేవు. సరైనదిగా నిరూపించుకోవడం కంటే మనశ్శాంతి చాలా విలువైనదని నేను నేర్చుకున్నాను. వివరణలు ఇవ్వడం కంటే మౌనంగా ఉండటమే మేలు. ప్రతి ఒక్కరూ మన శక్తిని పొందేందుకు అర్హులు కారు" అని త్రిష ఎంతో లోతైన అర్థం వచ్చేలా చెప్పుకొచ్చారు. ఎదుగుదల అంటే గట్టిగా అరవడం కాదని, కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండటమే అని త్రిష అభిప్రాయపడ్డారు. "మనం ఇతరుల అభిప్రాయాలను లేదా వారి ప్రవర్తనను నియంత్రించలేము. మనం చేయగలిగిందల్లా మన జీవితాన్ని నిజాయితీగా గడపడమే. ఈరోజు నా వంతుగా నేను ఉత్తమంగా జీవించాను అని తృప్తిగా నిద్రపోగలిగితే చాలు. మన జుట్టు, ముఖం, గొంతు లేదా మనం చెప్పే విషయాలు నచ్చని వారు ఎప్పుడూ ఉంటారు.. మనం అందరినీ మెప్పించలేము" అంటూ తనపై విమర్శలు చేసేవారికి గట్టి కౌంటర్ ఇచ్చారు.






