పవన్ కల్యాణ్‌కు దూరంగా ఉంటా.. బండ్ల గణేష్ సంచలన ట్వీట్

by Disha Web Desk 6 |
పవన్ కల్యాణ్‌కు దూరంగా ఉంటా.. బండ్ల గణేష్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్‌‌కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషాల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉంటారు. తాజాగా, ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్ సంచలన ప్రకటన చేశాడు. ‘‘గురు పూర్ణిమ సందర్భంగా మా గురువుకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు మీలాగే ఉండాలి మీరు అనుకున్నవన్నీ సాధించాలి. కసితో కృషితో మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. మీ స్థాయి ఏంటో? మీ స్థానం ఏంటో? తెలిసిన వాడిగా చెబుతున్నాను. ఎప్పుడు ఏ విధంగా మీ కీర్తిని కానీ మీ పేరును వాడుకొని లబ్ధి పొందను, పొందటానికి కూడా ప్రయత్నించను.. వీలైతే మీకు సహాయంగా ఉంటాను. లేకపోతే దూరంగా ఉంటాను. అంతేగాని మిమ్మల్ని ఏ విధంగా వాడుకొని నేను ఏ విధమైన లబ్ధి పొందనని, గురు పౌర్ణమి సందర్భంగా గురువు సాక్షిగా చెబుతున్నాను. నా చూపు నా ఆశ ఒకటే మీరు అనుకున్న ఆశయం సాధించాలి సాధిస్తారు. మీ నిస్వార్ధమైన మీ మనసు లాగే మీరు పది కాలాలపాటు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ.. మీ బండ్ల గణేష్ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ పేరు రాసి దండం పెట్టే ఎమోజీని షేర్ చేశాడు. దీంతో అది చూసిన నెటిజన్లు త్రివిక్రమ్, నాదెండ్ల లాగా అయితే ఉండవు అంతేగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read More: ఆ హీరోయిన్ కోసం రాత్రి గోడ దూకిన రాజమౌళి!

Next Story