- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దీపావళికి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాం.. ‘కరుప్పు’ అప్డేట్ ఇస్తూ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya), ఆర్జే బాలాజీ(rj balaji) కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘కరుప్పు’(karuppu).

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya), ఆర్జే బాలాజీ(rj balaji) కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘కరుప్పు’(karuppu). ఇందులో త్రిష (trisha) హీరోయిన్‌గా నటిస్తుండగా.. యోగిబాబు, నట్టి సుబ్రమణియం, శశివాడ కీలక పాత్రలో కనిపించనున్నారు. సాయి అభ్యాంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న డైరెక్టర్ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చాడు. ‘‘కరుప్పు సినిమా దాదాపు పూర్తయింది. మొదట్లో దీపావళికి విడుదల చేయాలని అనుకున్నాం. కానీ సీజీ వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల సకాలంలో చేయలేకపోయాం. నాకు ఈ మూవీ అంటే చాలా ఇష్టం... నా నిర్మాత ఎస్ఆర్ ప్రభు దీన్ని చాలా ఆసక్తిగా చూశారు. ఆయనకు ఇది చాలా నచ్చింది. ఊహించని విధంగా ఈ దీపావళికి ఈ సినిమా నుండి మొదటి పాటను విడుదల చేసి అభిమానులకు ట్రీట్ ఇవ్వబోతున్నాం. సూర్య సార్ మాస్ డ్యాన్స్‌ను చూడటానికి సిద్ధంగా ఉండండి. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలోకి వస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. దీంతో సూర్య అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.






