ఒకే ప్రాజెక్ట్ కోసం 2–3 ఏళ్లు వేస్ట్ చేయడం మూర్ఖత్వం.. స్టార్ హీరోల సినిమాలపై రవిబాబు సెన్సేషనల్ కామెంట్స్!

by Mallepaka Hamsa |

ఒకే ప్రాజెక్ట్ మీద అన్ని ఏళ్లు వెచ్చించడం మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. అంతర్జాతీయ స్థాయి హాలీవుడ్ చిత్రాలు కూడా షూటింగ్ కోసం ఇంత సమయం తీసుకోవు" అని ఆయన ఘాటుగా విమర్శించారు.

ఒకే ప్రాజెక్ట్ కోసం 2–3 ఏళ్లు వేస్ట్ చేయడం మూర్ఖత్వం.. స్టార్ హీరోల సినిమాలపై రవిబాబు సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ విలక్షణ నటుడు, దర్శకుడు రవిబాబు తనదైన శైలిలో మాట్లాడుతూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన భారీ బడ్జెట్ సినిమాల మేకింగ్ విధానంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఒకే సినిమా కోసం ఏళ్లకేళ్లు సమయం వృధా చేయడం సరైన పద్ధతి కాదని ఆయన కుండబద్ధలు కొట్టారు. ఒక సినిమాను పూర్తి చేయడానికి రెండు నుంచి మూడు ఏళ్లు తీసుకోవడాన్ని రవిబాబు తీవ్రంగా తప్పుబట్టారు. "ఒకే ప్రాజెక్ట్ మీద అన్ని ఏళ్లు వెచ్చించడం మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. అంతర్జాతీయ స్థాయి హాలీవుడ్ చిత్రాలు కూడా షూటింగ్ కోసం ఇంత సమయం తీసుకోవు" అని ఆయన ఘాటుగా విమర్శించారు. మన దగ్గర సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

సినిమా షూటింగ్ మొదలుపెట్టకముందే ప్రీ-ప్రొడక్షన్ పనులు పక్కాగా పూర్తి కావాలని రవిబాబు సూచించారు. సరైన అవగాహన, సన్నద్ధత లేకుండా సెట్స్ మీదకు వెళ్లడం వల్ల సమయం, డబ్బు రెండూ వృధా అవుతున్నాయని అన్నారు. హాలీవుడ్ టెక్నీషియన్లను ఉదాహరణగా చూపిస్తూ.. ట్రాన్స్‌ఫార్మర్స్ వంటి భారీ గ్రాఫిక్స్ సినిమాలు కూడా చాలా ప్లాన్డ్‌గా చేస్తారని గుర్తు చేశారు."హాలీవుడ్ లో ఒక్కో షిఫ్టులో 80 నుంచి 100 షాట్స్ చిత్రీకరిస్తారు. అది వారి ప్లానింగ్ పవర్. కానీ మన దగ్గర ఆ స్థాయి ప్రణాళికాబద్ధత అమలు కావడం లేదు" అని రవిబాబు తన అసహనాన్ని వ్యక్తం చేశారు. కేవలం స్టార్ హీరోల కాల్ షీట్ల కోసం లేదా సరైన స్క్రిప్ట్ వర్క్ లేక సినిమాలు లేట్ అవ్వడం వల్ల నిర్మాణ వ్యయం పెరిగిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, నెటిజన్లు కొందరు ఆయన మాటలతో ఏకీభవిస్తున్నారు మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు..

Next Story