సూపర్ ధమ్కీ ఇవ్వాలని శ్రీవారిని కోరుకున్న దాస్

by Anjali |
సూపర్ ధమ్కీ ఇవ్వాలని శ్రీవారిని కోరుకున్న దాస్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్, స్వీయ దర్శకత్వంలో నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. ఈ చిత్రానికి కథానాయిక నివేత పేతురాజ్. గతంలో వీరిద్దరు పాగల్ చిత్రంలో కలిసి నటించి ప్రేక్షకుల ఆదరణ పొందిన విషయం తెలిసిందే. మార్చి 22న విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 13న జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తారక్ ముఖ్య అతిధిగా హాజరై....‘ దాస్ కా ధమ్కీ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని, భవిష్యత్తులో విశ్వక్ తీయబోయే మరిన్ని సినిమాలకి ఇది ఆదర్శం కావాలని ఆకాంక్షించారు.’

ఇక బాలయ్య అభిమానుల సపోర్ట్ విశ్వక్ సేన్ ఎప్పుడో సంపాదించిన విషయం తెలిసిందే. తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తు్న్న ఈ సినిమా ఎలాగైనా మంచి హిట్ సాధించాలని, మరెన్నో అవకాశాలు రావాలని విశ్వక్ ఈ రోజు ఉదయం(మార్చి20) తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వెళ్లాడు. విశ్వక్ మెట్లపై కాలినడకతో శ్రీవారి దర్శనానికి చేరుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతోంది. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ కథని అందించగా, కరాటే రాజ్, విశ్వక్ సేన్ బ్యాంక్రోల్ చేస్తున్నారు. రామ్ మిరియాల ఒక పాటకి మ్యూజిక్ అందించారు. రావు రమేష్, అజయ్, తరుణ భాస్కర్, హైపర్ ఆది, అక్షర గౌడ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Next Story