- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంచలన నిర్ణయం తీసుకున్న విశాల్.. ఇకపై అలాంటి సినిమాలు చేయనంటూ షాకింగ్ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్(vishal) బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్(vishal)48 ఏళ్ల వయసులో బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నాడు. త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. విశాల్, సాయి ధన్సిక (Sai Dhansika)గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. తమ ప్రేమను ఇటీవల అధికారికంగా ప్రకటించారు. వీరిద్దరి మధ్య 14 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుంటా త్వరలో ఏడడుగులు వేయబోతున్నారు. ఇక ఆగస్టు 29న విశాల్ పుట్టినరోజు కావడంతో ఆ రోజు పెళ్లి చేసుకోవాల్సి ఉండగా నడిగర్ సంఘం నిర్మాణం పూర్తి కానందున ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. మరో రెండు నెలల్లో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం ఆలోపు పూర్తి అవుతుందని తెలిపాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశాల్ సినిమాల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
‘‘సాయి ధన్సికతో నా ప్రయాణం చాలా అందంగా ఉంది. ఇన్నేళ్లు ఒకరిని ఒకరం సపోర్ట్ చేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చాము. ఇకపై మా జీవితాలను మరింత అందంగా మార్చుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నాము. నేను ఇప్పటి వరకు ఉన్నట్లుగా ఉండాలనుకోవడం లేదు. ఇక నుంచి పూర్తిగా మారిపోవాలని నిర్ణయించుకున్నాను. పెళ్లి తర్వాత కొన్ని రకాల సీన్లకు దూరంగా ఉండబోతున్నాను. ఒకపై హీరోయిన్లతో లిప్ లాక్, బోల్డ్ సీన్లు, రొమాంటిక్ సన్నివేశాల్లో చేయకూడదనుకుంటున్నా. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు మాత్రమే చేస్తాను. గతంతో పోలీస్తే నాలో చాలా మార్పులు వచ్చాయి.
సినిమాలు సెలెక్ట్ చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నా. ఇప్పటి వరకు చేయనటువంటి కొత్త తరహా కథలు ఎంచుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చాడు. ఇక విశాల్ సినిమాల విషయానికొస్తే.. త్వరలో ‘మకుటం’(makutam) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా విశాల్ కెరీర్‌లో 35వ ప్రాజెక్ట్‌గా రాబోతుంది. రవి అరసు దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. దుషారా విజయన్(Dushara Vijayan) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా.. వారి బ్యానర్‌లో 99వ సినిమాగా రాబోతుంది.






