40 ఏళ్ల స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న విక్రమ్ కూతురు.. ఇదేం దరిద్రమంటున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-06 14:52:18  IST  )

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ధురంధర్’.

40 ఏళ్ల స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న విక్రమ్ కూతురు.. ఇదేం దరిద్రమంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ధురంధర్’. ఈ సినిమాకు నేషనల్ అవార్డు విన్నర్ ఆదిత్య ధర్(Aditya Dhar) దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న రెండో ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని బి62 స్టూడియోస్, జియో స్టూడియోస్ బ్యానర్స్‌పై లోకేష్ ధర్, ఆదిత్య ధర్ నిర్మిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్(Sanjay Dutt), అక్షయ్ ఖన్నా(Akshaye Khanna), ఆర్, మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

నేడు రణ్‌వీర్ సింగ్ పుట్టిన రోజు కావడంతో ఫస్ట్ లుక్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఇందులో ఆయన ఓ హీరోయిన్‌ను ఎత్తుకుని తిప్పుతూ కనిపించాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే రణ్‌వీర్ సింగ్ ఎత్తుకున్న హీరోయిన్ మరెవతరో కాదు.. నటుడు రాజ్ అర్జున్ కూతురు సారా(Sara Arjun). ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. మరీ ముఖ్యంగా ‘నాన్న’ మూవీలో చియాన్ విక్రమ్‌కు కూతురిగా నటించి తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది.

హిందీ, తమిళ సినిమాలతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ‘ధురంధర్’ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. మొదటి సినిమాతో 40 ఏళ్ల వయసున్న హీరోతో 20 ఏళ్ల సారా రొమాన్స్ చేసేందుకు సిద్ధమవడంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు తండ్రి వయసున్న హీరోతో నటించమేంటి ఏంటి మాకు ఈ దరిద్రం అని ‘ధురంధర’ క్లిప్స్ షేర్ చేస్తున్నారు. ఇక ఇందులో సారా హీరోయిన్‌గా నటిస్తుందా? లేక ఇతర పాత్రలో చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ‘ధురంధర’ ఫస్ట్ లుక్ టీజర్ మాత్రం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

link

Next Story