విడుదల పార్ట్1’.. తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్

by Disha Web Desk 23 |
విడుదల పార్ట్1’.. తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా : వెట్రిమారన్ రచించి, దర్శకత్వం వహించిన పీరియాడిక్ పోలీస్ ప్రొసీజర్ క్రైమ్ థ్రిల్లర్ ‘విడుదలై పార్ట్ 1’. మార్చి 31న తమిళంలో విడుదలైన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 15న ‘విడుదల పార్ట్ 1’ పేరుతో తెలుగులో ‘గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్‌లో.. విచారణ పేరుతో మహిళలను చిత్రహింసలకు గురిచేస్తున్న పోలీసులపై పెరుమాళ్ మాస్టర్‌‌గా నటించిన విజయ్ సేతుపతి పోరాటం ఆకట్టుకుంది. అలాగే కానిస్టేబుల్ కుమరేశన్‌గా నటిస్తున్న సూరి తమ పోలీసు బలగాలతో పెరుమాళ్ కోసం వెతకడం ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తోంది. ఇక RS ఇన్ఫోటైన్‌మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌లపై ఎల్రెడ్ కుమార్ నిర్మించిన చిత్రంలో భవానీ శ్రీ, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ కీలక పాత్రల్లో నటించారు.

ఇవి కూడా చదవండి: ఎన్.బీ.కే 108: భారీ సెట్ లో సాంగ్ షూట్ పూర్తి

Next Story