- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విజయ్ దేవరకొండ.
హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని విజయ్ దేవరకొండ మర్యాదపూర్వకంగా కలిశారు.

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ గత కొద్ది కాలంగా వార్తలు జోరందుకున్నాయి. కొన్నేళ్లుగా రష్మిక మందన్నతో ప్రేమలో ఉన్న ఆయన ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని టాక్. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ, తాజాగా హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు. తన వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ సీఎంకు శుభలేఖను అందించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్‌ను అభినందించి, కాబోయే జంటకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ జంట రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఒక చారిత్రక ప్యాలెస్‌లో ఫిబ్రవరి 26, 2026న వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.
మార్చి మొదటి వారంలో రిసెప్షన్
ఈ వేడుకను కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ప్రైవేట్‌గా నిర్వహించనున్నారు. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చెబుతున్నాయి. ఉదయ్‌పూర్‌లో ప్రైవేట్ వెడ్డింగ్ ముగిసిన తర్వాత, మార్చి మొదటి వారంలో (మార్చి 4వ తేదీన) హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల, బంధువుల కోసం ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసిన ఈ జోడీ, అప్పటి నుంచే రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గతేడాది అక్టోబర్‌లో వీరి నిశ్చితార్థం కూడా రహస్యంగా జరిగిందని టాక్. ఎట్టకేలకు తమ అభిమాన జంట ఒకటవుతుండటంతో అభిమానులు కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు.






