విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ ట్రైలర్‌..

by Dishafeatures1 |
విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ ట్రైలర్‌..
X

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలి స్టార్’.మృణాళ్‌ ఠాకూర్‌ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్‌. ఇందులో భాగంగా ఇప్పటి వరకు విడుదలైనా టైటిల్‌ లుక్‌, గ్లింప్స్, టీజర్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచగా.. మరోవైపు రీసెంట్ గా రిలీజైనా ‘మధురం కదా’ సాంగ్‌ సోషల్ మీడియాలో మారుమ్రోగిపొతుంది. ఇక తాజాగా ‘ఫ్యామిలీ స్టార్’ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు మేకర్స్.

స్వామి నా జీవితంలో కొత్తగా బ్రేక్‌లు ఇవ్వకున్నా పర్వాలేదు..కానీ ఉన్నదాన్ని మాత్రం చెడగొట్టకు.. అంటూ విజయ్‌ దేవరకొండ డైలాగ్స్‌తో మొదలైన ట్రైలర్‌.. కుటుంబం చుట్టూ తిరిగే ఫన్‌ అండ్‌ సీరియస్‌ ఎలిమెంట్స్‌తో సినిమా వినోదాత్మకంగా సాగనున్నట్టు తెలుస్తోంది. పరశురాం మరోసారి తన మార్క్‌ను సినిమాలో పర్‌ఫెక్ట్‌గా చూపించబోతున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. మృణాల్ యాక్టింగ్ కూడా ఎంతో ఆకట్టుకునే సిద్ధంగా ఉంది. మొత్తానికి విజయ్ మంచి హిట్ కొట్టడం ఖాయం.



Next Story

Most Viewed