మెగా 154లో విక్టరీ వెంకటేష్?

by sudharani |
మెగా 154లో విక్టరీ వెంకటేష్?
X

దిశ, సినిమా : చిరంజీవి క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న మెగా 154 చిత్రానికి 'వాల్తేరు వీరయ్య' టైటిల్‌ను పరిశీలిస్తున్నారు మేకర్స్. బాబీ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న సినిమాలో ఇప్పటికే రవితేజ జాయిన్ కాగా మరో క్రేజీ న్యూస్ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇందులో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.

ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇదే నిజమైతే ఇద్దరు స్టార్స్‌ను ఒకే తెరపై చూడోచ్చని సంతోషపడుతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న సినిమాలో సముద్రఖని, బాబీ సింహా, కేథరిన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Next Story