‘వెయ్యినొక్క జిల్లాల వరకు’.. ‘రావణాసుర’ నుంచి మరో సాంగ్

by Disha Web Desk 7 |
‘వెయ్యినొక్క జిల్లాల వరకు’.. ‘రావణాసుర’ నుంచి మరో సాంగ్
X

దిశ, సినిమా : స్టార్ నటుడు రవితేజ, సుధీర్ వర్మ కాంబోలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’. అభిషేక్ పిక్చర్స్, ఆర్.టి టీమ్‌వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా, రవితేజ నిర్మిస్తున్న చిత్రంలో సుశాంత్, అను ఇమ్మాన్యుయల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఏప్రిల్ 7న రిలీజ్ అవుతున్న సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్, సాంగ్స్ అభిమానులను అలరిస్తున్నాయి.

ఈ క్రమంలో ‘వెయ్యినొక్క జిల్లాల వరకు’ అనే మూడవ సింగిల్ లిరికల్ వీడియో మార్చి 15న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగానే అనౌన్స్‌మెంట్ పోస్టర్ కూడా రిలీజ్ చేయగా.. ఇది రెట్రో నేపథ్యానికి సంబంధించిన పాటగా అర్థమవుతోంది. రవితేజ, మేఘా ఆకాష్ ఇద్దరూ స్కూటర్‌పై కూర్చొని రెట్రో కాస్ట్యూమ్స్‌లో కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. కాగా హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Next Story

Most Viewed