- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Venu Swamy: నాగచైతన్య, శోభిత జాతకాలు చెప్పి షాకిచ్చిన వేణు స్వామి.. ఆమె వల్ల విడిపోతారంటూ సంచలన పోస్ట్
దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీల జాతకాలు చెప్పి సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. సమంత, నాగచైతన్య ఎంగేజ్మెంట్ సమయంలో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోతారని చెప్పి సోషల్ మీడియాను షేక్ చేశాడు. ఈ జంట పెళ్లి తర్వాత నిజంగానే డైవర్స్ తీసుకుని విడిపోవడంతో వేణు స్వామి మాటలు అంతా నమ్మడం మొదలెట్టారు. కానీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ గెలుస్తారని చెప్పాడు కానీ.. ఊహించని విధంగా పవన్ కల్యాణ్ విజయం సాధించడంతో వేణు స్వామి ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా తాను జాతకాలు చెప్పనని కూడా అధికారికంగా ప్రకటించాడు. అప్పటి నుంచి సెలబ్రిటీల జాతకాలు చెప్పలేదు. కానీ మళ్లీ ఆగస్టు 8న జరిగిన నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం పై సంచలన పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచాడు వేణు స్వామి.
వీరిద్దరి జీవితం మీద విశ్లేషణ ఉందని పోస్ట్ పెట్టాడు. తాజాగా, నాగచైతన్య, శోభిత జాతకాలు చూసిన ఆయన సంచలన వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశాడు. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ముహుర్తం గురించి మాట్లాడుకుందాం. వైవాహిక జీవితానికి సంబంధించి 7 స్థానంలో కలత్ర స్థానంలో ఉండాలి. దీని వల్ల భార్యాభర్తలపై కలతలు ఏర్పడతాయి. నాగార్జున ఫిక్స్ చేసింది నిషేద మూహుర్తం. మరి దీనినే వీరు ఎందుకు ఫిక్స్ చేసుకున్నారంటే ఎనిమిదో నెల 8 తేదీ 2024 కాబట్టి ముహూర్తం బలంగా ఉందనుకుని పెట్టుకున్నారు కావచ్చు. నిశ్చితార్థం కు పనికిరాని మూహుర్తంలో చేసుకున్నారు. అయితే సమంతది మేషరాశి.. శోభితది ధనుష్ రాశి ఆమె కూడా అమావాస్య నాడు పుట్టింది. నాగచైతన్య, సామ్ పెళ్లి కాకముందే చెప్పాను. వారిద్దరు విడాకులు తీసుకుని విడిపోతారని.
అలాగే ఇప్పుడు శోభిత, చైతు జాతకాలు విశ్లేషన చేశాను. నేను అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. కానీ శోభిత జాతకం వల్ల 2027 నుంచి వివాహ బంధంలో కలతలు, సమస్యలు ఏర్పడతాయి. వీరి గొడవలకు కారణం ఓ స్త్రీ. నాగచైతన్య, శోభిత జాతకాలు కలవలేదు. నిశ్చితార్ధానికి పెట్టిన ముహూర్తం కూడా మంచిది కాదు. నేను అఖిల్ విషయంలో ఇలాగే చెప్పాను. ఇప్పుడు ఒక జ్యోతిష్యుడిగా మంచి కోసం చెప్తున్నాను. నా జాతకం ఫెయిల్ కావాలని కోరుకుంటున్నాను. కానీ వారి జాతకాలు బాలేదు నాగచైతన్య, శోభిత విడిపోతారు. నన్ను మీరు అడగొచ్చు సమంత, నాగచైతన్యకు 50 మార్కులు అయినా వేస్తా. కానీ శోభితకు మాత్రం 10 మార్కులు కూడా వేయలేను. ఎందుకంటే కెరీర్ పరంగా సామ్ జాతకం బాగుంది. కానీ శోభితది బాలేదు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే.. వీరిద్దరి మధ్య ఎడబాటుకు గురవుతారు’’ అని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ వేణు స్వామి వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
(Video Link Credits to parankushamvenu Instagram Channel)