Varun Tej - Lavanya పెళ్లి డేట్ ఫిక్స్.. ఆ ప్రత్యేకమైన ప్లేస్‌లోనే!

by Disha Web Desk 9 |
Varun Tej - Lavanya పెళ్లి డేట్ ఫిక్స్.. ఆ ప్రత్యేకమైన ప్లేస్‌లోనే!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జూన్ 9వ తేదీన నాగబాబు నివాసంలో అంగరంఠ వైవభంగా జరిగిన సంగతి తెలిసిందే. ఎంగేజ్‌మెంట్ తర్వాత వీరిద్దరు ఫారిన్ ట్రిప్‌కు వెళ్లి ఎంజాయ్ చేశారు. ఇటీవలే కాఫీ డేట్‌కు కూడా వెళ్లారు. ఈ విషయాన్ని నేరుగా వారే తమ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఒకరి ఫోటోను మరొకరు షేర్ చేశారు. ఈ క్యూట్ కపుల్‌కు మెగా ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా.. వీరికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. వరుణ్-లావణ్య ఒక్కటయ్యే క్షణం రానే వచ్చేసింది. ఆగస్టు 24వ తేదీన వీరి లవ్ తొలిసారి చిగురించిన ఇటలీలో వీరి వివాహం గ్రాండ్‌గా జరగనుందని తెగ ప్రచారం జరుగుతోంది. ఇంకో విషయమేంటంటే పెళ్లికి సంబంధించిన పనులు లావణ్య, వరుణ్ దగ్గరుండి చూసుకుంటున్నారట. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ న్యూస్‌గా మారింది.

Also Read: ఇంత బోల్డ్ క్యారెక్టర్ చేయించడానికి వైష్ణవిని ఎలా కన్విన్స్ చేశారో తెలుసా? బయటపడ్డ సంచలన నిజం!

మహేష్ బాబు కూతురు సితార ఓణీ ఫంక్షన్ .. వీడియో ట్రెండింగ్



Next Story

Most Viewed