‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’ టీజర్ అప్డేట్ ఇచ్చిన వరుణ్ ధావన్.. పోస్టర్ సూపర్ అంటున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan), జాన్వీ కపూర్(Janhvi Kapoor) కాంబినేషన్‌లో రాబోతున్న రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’(Sunny Sanskari Ki Tulsi Kumari).

‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’ టీజర్ అప్డేట్ ఇచ్చిన వరుణ్ ధావన్.. పోస్టర్ సూపర్ అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan), జాన్వీ కపూర్(Janhvi Kapoor) కాంబినేషన్‌లో రాబోతున్న రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’(Sunny Sanskari Ki Tulsi Kumari). శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ మూవీలో మనీష్ పాల్, అక్షయ్ ఒబేరాయ్, సన్యా మల్హోత్రా, రోహిత్ సరాఫ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకోగా.. అక్టోబర్ 2న ‘సన్నీ సంస్కారికి తులసి కుమారి’ థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో.. మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా, వరుణ్ ధావన్ ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్స్ షేర్ చేస్తూ.. టీజర్ ఆగస్టు 28న రాబోతున్నట్లు వెల్లడించాడు. పెళ్లికి మండపం రెడీ చేశాక.. సన్నీ, కుమారి ఎంట్రీతో అక్కడ పరిస్థితి అంతా మారిపోతుంది’’ అనే క్యాప్షన్ జత చేసి జాన్వీతో క్లోజ్‌గా ఉన్న పోస్టర్‌ను షేర్ చేశాడు. ఇక అది చూసిన సినీ ప్రియులు సూపర్ అని కామెంట్లు చేస్తున్నారు.

Next Story