- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'వారిసు'.. 'బృందావనం' సినిమాకు రీమేకా?
తమిళ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం 'వారిసు'. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది..

దిశ, సినిమా: తమిళ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం 'వారిసు'. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్, లిరికల్ సాంగ్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ భారీ బడ్జెట్ సినిమాతో నిర్మాతగా దిల్‌రాజు తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇదిలాఉంటే.. 'వారిసు' మూవీ ఎన్‌టీఆర్ హీరోగా నటించిన 'బృందావనం' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై శనివారం చెన్నైలో జరిగిన 'వారిసు' ఆడియో లాంచ్ ఈవెంట్‌లో దిల్‌రాజు క్లారిటీ ఇచ్చాడు. 'ఇది 'బృందావనం' రీమేక్ కాదు. స్ట్రెయిట్ కథతోనే ఈ సినిమా చేస్తున్నాం. అసలు తారక్ మూవీకి, దీనికి ఎలాంటి సంబంధం ఉండదు' స్పష్టం చేశాడు.






