‘వైరం’తో దేవరాజ్ కొడుకు టాలీవుడ్ ఎంట్రీ

by Disha Web Desk 7 |
‘వైరం’తో దేవరాజ్ కొడుకు టాలీవుడ్ ఎంట్రీ
X

దిశ, సినిమా : సీనియర్ నటుడు దేవరాజ్ తనయుడు ప్రణం దేవరాజ్ ‘వైరం’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. యువాన్స్ నాయుడు సమర్పణలో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి పిక్చర్స్, సంస్కృతి ప్రొడక్షన్స్, సర్తాక్ పిక్చర్స్ బ్యానర్స్‌పై జె. మల్లికార్జున నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి శివం జంపాన దర్శకులు. కాగా మూవీ టీజర్‌ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు.

దేవరాజ్, చంద్ర దేవరాజ్‌ల చేతుల మీదుగా శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి బ్యానర్ లోగోను లాంచ్ చేయగా.. బెనర్జీ, కాశీ విశ్వనాథ్ ‘వైరం’ టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన దేవరాజ్.. తనను ఆదరించినట్లుగానే తన కొడుకును ఆశీర్వదించాలని తెలుగు ప్రేక్షకులను కోరాడు. ఈ సినిమా టీజర్‌కు కన్నడలో మంచి రెస్పాన్స్ వచ్చిందని, నిర్మాత మల్లికార్జునకు ఈ సినిమా కచ్చితంగా మంచి పేరు తెస్తుందని అభిప్రాయపడ్డాడు.



Next Story