- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవసరానికి వాడుకుని వదిలేస్తారు.. సురేఖవాణి సంచలన కామెంట్స్
టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో.. ఎక్కువగా బ్రహ్మానందం భార్యగా నటించి.. తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకుంది సురేఖవాణి.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో.. ఎక్కువగా బ్రహ్మానందం భార్యగా నటించి.. తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకుంది సురేఖవాణి. భర్త, బాబాయ్, మామ పాత్రలు ఎంత కీలకమో భార్య, పిన్ని, అత్త క్యారెక్టర్లు కూడా అంతే ముఖ్యం. ఇలాంటి రోల్స్‌లో జీవించే నటి అంటే తెలుగు చిత్రసీమలో ముందుగా గుర్తొచ్చే లిస్ట్‌లో సురేఖవాణి పేరు కూడా ఉంటుంది. అయితే ఈ నటి తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో ‘‘నాకు ఎవరు లేరు. ఉండాలని కూడా నేను భావించడం లేదు. లేని ప్రేమలు ఉన్నాయని ఫీల్ అవ్వడం వేస్ట్. అలా బతకలేను. అవసరానికి వాడుకొని టైమ్ వచ్చినప్పుడు ఒదిలేస్తారు. కానీ అలాంటి స్టుప్పిడ్‌ను నేను కాదు అని సురేఖవాణి ఆ వీడియోలో వెల్లడించింది. దీంతో నెటిజన్లు ‘‘సురేఖను ఎవరో వాడుకొని వదిలేశారు. అందుకే ఇలాంటి డైలాగ్స్ చెబుతుంది. ఇకనైనా అలాంటి వారికి దూరంగా ఉండండి మేడం. ప్రస్తుత సమాజంలో చీటింగ్ చేసేవారే ఎక్కువగా ఉన్నారు’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.






