పెళ్లి ప్రకటన చేసి బిగ్ షాకిచ్చిన ఉర్ఫీ జావెద్.. నిన్ను చేసుకునేవాడికి దండం పెట్టాలంటున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

హాట్ బ్యూటీ ఉర్ఫీ జావెద్(Urfi Javed) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

పెళ్లి ప్రకటన చేసి బిగ్ షాకిచ్చిన ఉర్ఫీ జావెద్.. నిన్ను చేసుకునేవాడికి దండం పెట్టాలంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: హాట్ బ్యూటీ ఉర్ఫీ జావెద్(Urfi Javed) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. పలు టాస్కుల్లో పాల్గొన్నప్పటికీ విన్నర్ కాలేకపోయింది. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చి తన ఫ్యాషన్‌ను బయటపెట్టి వెరైటీ డ్రెస్సులు ధరించి విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది. కొద్ది రోజుల్లో అమ్మడు రేంజ్ మారిపోయింది. ఫ్యాషన్ విషయంలో చెరగని ముద్ర వేసుకుంది. వెరైటీ బట్టలు తయారు చేయడంలో తనను మించిన వారు లేరన్నట్లుగా రెచ్చిపోతుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాషన్ విషయంలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. ఎన్ని విమర్శలు చేసినప్పటికీ పట్టించుకోకుండా తనకు నచ్చిన దుస్తులు ధరిస్తూ గ్లామర్ డోస్ పెంచుతోంది.

తాజాగా, ఈ హాట్ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నట్లు వెల్లడిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నా బాయ్‌ఫ్రెండ్ 6'4 ఎత్తు ఉంటాడు. అతను ఢిల్లీకి చెందినవాడు. చాలా సిగ్గుపడే వ్యక్తి. అందుకే అతను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి పోస్టులు షేర్ చేయడు. ఫొటో కూడా నా దగ్గర లేదు. మేము ప్రతి వారాంతంలో కలుస్తాము. యాదృచ్ఛికంగా ఒక్కొసారి మేము ఒకే సమయంలో ఒక ప్రదేశంలో ఉంటాము. మా ఫస్ట్ మీట్ విచిత్రంగా జరిగింది. అతని అమ్మనాన్న కూడా అక్కడే ఉన్నారు. వాళ్లు అతని పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు.. మమ్మల్ని చూసి షాక్ అయ్యారు. అతని పెళ్లిని చెడగొట్టాను. ఇంట్లో మా ప్రేమ గురించి చెప్పాము. కానీ మా పెళ్లి డేట్ ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే మేమిద్దరం ఒక్కటి కాబోతున్నాము’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు నిన్ను చేసుకునేవాడికి దండం పెట్టాలి ఎలా భరిస్తాడో అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం షాక్ అవుతున్నారు.

Next Story