- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నటిని రేప్ చేస్తానని బెదిరించిన యువకుడు.. చివరికి అలా చేసి..
సోషల్ మీడియా స్టార్ ఉర్ఫీ జావెద్ ఇటీవల రేప్ బెదిరింపులకు గురైనట్లు తెలిపింది. నిరంతరం అసాధారణమైన ఫ్యాషన్ సెన్స్‌తో ముఖ్యాంశాల్లో నిలిచే నటి మొబైల్స్, చార్జింగ్ కేబుల్, అద్దాలు, గాజు ముక్కలతో కూడిన డ్రెస్సింగ్‌తో ఆశ్చర్యపరుస్తూనే ఉంటోంది.. Latest Telugu News

దిశ, సినిమా: సోషల్ మీడియా స్టార్ ఉర్ఫీ జావెద్ ఇటీవల రేప్ బెదిరింపులకు గురైనట్లు తెలిపింది. నిరంతరం అసాధారణమైన ఫ్యాషన్ సెన్స్‌తో ముఖ్యాంశాల్లో నిలిచే నటి మొబైల్స్, చార్జింగ్ కేబుల్, అద్దాలు, గాజు ముక్కలతో కూడిన డ్రెస్సింగ్‌తో ఆశ్చర్యపరుస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తన వేషాధారణపై వస్తున్న నెగెటివ్ కామెంట్లను తిప్పికొడుతోంది. తాజాగా తన ఫాలోవర్స్‌లో ఒకరు తనను రేపు చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డట్లు తెలుపుతూ ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. దీంతో ఉర్ఫీ అభిమానులు అతడిపై మాటల యుద్ధానికి దిగడంతో వెంటనే క్షమాపణలు చెబుతూ మరో వీడియోను పంచుకున్నట్లు వెల్లడించింది. 'కొంతకాలం క్రితం నేను ఉర్ఫీ పోస్ట్‌పై దారుణంగా వ్యాఖ్యానించాను. దుర్భాషలాడుతుూ రేప్ చేస్తానని బెదిరించాను. నా తప్పును మన్నించాలని కోరుతున్నా' అంటూ క్షమాపణలు చెప్పినట్లు తెలిపింది.
Read More: అతడితో సహజీవనం చేసి మోసపోయా: స్టార్ హీరోయిన్






