నోరా ఫతేహికి ఊహించని షాక్.. చర్యలు తప్పవంటూ మహిళా కమిషన్ లాస్ట్ వార్నింగ్

by Mallepaka Hamsa |

లాయర్లు చెబితే కుదరదు.. నువ్వు పర్సనల్‌గా రావాల్సిందే అని నోరాకు ఏప్రిల్ 27 వరకు చివరి అవకాశం ఇచ్చారు

నోరా ఫతేహికి ఊహించని షాక్.. చర్యలు తప్పవంటూ మహిళా కమిషన్ లాస్ట్ వార్నింగ్
X

దిశ, సినిమా: కన్నడ పాన్ ఇండియా సినిమా 'KD: ది డెవిల్' ఇప్పుడు ఓ పాట వల్ల పెద్ద చిక్కుల్లో పడింది. ఈ సినిమాలో నోరా ఫతేహి, సంజయ్ దత్ కలిసి నటించిన 'సర్కే చునర్ తేరీ సర్కే' అనే పాట ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పాటలో వాడిన పదాలు, నోరా చేసిన డ్యాన్స్ చాలా అసభ్యంగా ఉన్నాయంటూ జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. ఈ వివాదంపై వివరణ ఇవ్వాలని నోరా ఫతేహికి కమిషన్ నోటీసులు ఇచ్చింది. అయితే, ఏప్రిల్ 6న జరిగిన విచారణకు నోరా రాకుండా తన లాయర్‌ను పంపించింది. దీనిపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ తీవ్రంగా మండిపడ్డారు. "లాయర్లు చెబితే కుదరదు.. నువ్వు పర్సనల్‌గా రావాల్సిందే" అని నోరాకు ఏప్రిల్ 27 వరకు చివరి అవకాశం ఇచ్చారు. ఆ రోజు కూడా రాకపోతే చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు. ఇక విచారణకు హాజరైన దర్శకుడు ప్రేమ్, పాట రాసిన రచయిత.. మాకు ఆ పదాలకు అర్థం తెలియదని తప్పించుకోవాలని చూశారు. కానీ కమిషన్ వారిని వదిలిపెట్టలేదు. "లిరిక్స్ అర్థం తెలియకుండానే పాటలు రాస్తారా?" అని ప్రశ్నించడంతో, వారు తమ తప్పును ఒప్పుకుని లిఖితపూర్వక క్షమాపణలు చెప్పారు. ఈ పాట వల్ల సమాజానికి చెడు సందేశం వెళ్లిందని ఒప్పుకున్న టీమ్.. రాబోయే మూడు నెలల పాటు మహిళల కోసం పని చేస్తామని మాట ఇచ్చింది.

Next Story