‘RT-76’ సినిమాలో రవితేజతో రొమాన్స్ చేయబోతున్న ఇద్దరు టాలీవుడ్ భామలు.. లక్కీ చాన్స్ కొట్టేశారుగా!

by Mallepaka Hamsa |

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఆయన ఖాతాలో హిట్ పడటం లేదు.

‘RT-76’ సినిమాలో  రవితేజతో రొమాన్స్ చేయబోతున్న ఇద్దరు టాలీవుడ్ భామలు.. లక్కీ చాన్స్ కొట్టేశారుగా!
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఆయన ఖాతాలో హిట్ పడటం లేదు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బాక్సాఫీసు వద్ద సందడి చేస్తున్నారు. హిట్, ఫ్లాప్ అని చూడకుండా తనకు నచ్చిన కథలను ఒప్పుకుంటూ ఫుల్ బిజీగా మారారు. ప్రస్తుతం ఆయన ‘మాస్ జాతర’ సినిమాతో పాటు కిశోర్ తిరుమల(Kishore Tirumala) దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. RT-76 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మి వెంటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

అయితే ఈ చిత్రానికి ‘అనార్‌కళి’ టైటిల్ పెట్టాలని మూవీ మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో రవితేజ సరసన టాలీవుడ్ యంగ్ బ్యూటీస్ అషికా రంగనాథ్(Ashika Ranganath), డింపుల్ హయాతీ(Dimple Hayati) రొమాన్స్ చేయనున్నట్లు టాక్.

అలాగే ‘విరూపాక్ష’ ఫేమ్ సోనియా సింగ్ కూడా కీలక పాత్రలో కనిపించనుందట. ఈ ముగ్గురు భామలు హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొన్నారు. రవితేజతో కలిసి పలు సీన్స్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు లక్కీ చాన్స్ కొట్టేశారని అంటున్నారు. వీడియో

link

Next Story