‘కాంచన-4’ మూవీలో ఇద్దరు హీరోయిన్లు కన్ఫర్మ్.. నెట్టింట క్యూట్ వీడియో వైరల్

by Mallepaka Hamsa |

హీరో రాఘవ లారెన్స్(Raghava Lawrence) వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. హీరోగా నటిస్తూనే దర్శకత్వం కూడా వహిస్తున్నారు.

‘కాంచన-4’ మూవీలో ఇద్దరు హీరోయిన్లు కన్ఫర్మ్.. నెట్టింట క్యూట్ వీడియో వైరల్
X

దిశ, సినిమా: హీరో రాఘవ లారెన్స్(Raghava Lawrence) వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. హీరోగా నటిస్తూనే దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఇక ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘ముని’ ఒకటి. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసును షేక్ చేసింది. దీంతో ముని ఫ్రాంఛైజీస్‌లో భాగంగా ‘కాంచన’ను తీసుకువచ్చారు. కామెడి, హీరర్ సీన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ఘన విజయం సాధించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కాంచన-3’ని తెరకెక్కించారు. ఇక ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘కాంచన-4’ (Kanchana-4)రాబోతున్న విషయం తెలిసిందే. దీనిని గోల్డ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి(Nora Fatehi), పూజా హెగ్డే(Pooja Hegde) కీPooja Hegdeలక పాత్రలో నటిస్తున్నట్లు గత కొద్ది కాలంగా పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం విడుదల కాకపోవడంతో నెటిజన్లు అయోమయంలో పడిపోయారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ‘కాంచన-4’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుపుతూ పూజా హెగ్డే, నోరా ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో వీరిద్దరు బెడ్‌పై పడుకుని ఉండగా.. పూజా వర్షం తగ్గిపోతుందని అనుకుంటున్నావా.. అని అడగ్గా.. దానికి నోరా ఇది వర్షాకాలం కాబట్టి తగ్గదు అని అంటుంది. ప్రస్తుతం వీరిద్దరి క్యూట్ కన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

link

Next Story