పదేండ్ల కల నిజం కాబోయే రోజు వచ్చేసిది.. పవన్ గెలుపుపై త్రివిక్రమ్ సంచలన పోస్ట్!

by Jakkula Samataha |

దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ కొనసాగుతోంది. ఏ పార్టీ ఓటర్ల మనసు గెలుచుకొని అధికారం చేబడుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఏపీ ఎన్నికల్లో ఈ సారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుపు ఎలా ఉండబోతుంది?

పదేండ్ల కల నిజం కాబోయే రోజు వచ్చేసిది.. పవన్ గెలుపుపై త్రివిక్రమ్ సంచలన పోస్ట్!
X

దిశ, సినిమా : దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ కొనసాగుతోంది. ఏ పార్టీ ఓటర్ల మనసు గెలుచుకొని అధికారం చేబడుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఏపీ ఎన్నికల్లో ఈ సారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుపు ఎలా ఉండబోతుంది? ఆయన గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారా? అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈయన గెలవాలనీ చిత్రపరిశ్రమ మొత్తం బలంగా కోరుకున్న విషయం తెలిసిందే. చాలా మంది సెలబ్రిటీస్ ఈయనకు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడమే కాకుండా, పలువురు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో స్టార్ డైరెక్టర్, మాటల మాత్రికుడు త్రివిక్రమ్ సంచలన పోస్ట్ చేశారు. ‘‘ చివరకు ఆరోజు రానే వచ్చింది.. పదేండ్ల కల నిజం కాబోయే రోజు అంటూ.. పవన్ కళ్యాణ్ గెలుపుపై ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం త్రివిక్రమ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Next Story