- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీరియాడికల్ డ్రామా ‘పళ్లిచట్టంబి’ ట్రైలర్ రిలీజ్
మలయాళంలో విభిన్నమైన పాత్రలు పోషించే టోవినో థామస్, ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తున్నారు. ట్రైలర్‌లో ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉన్నాయి.

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ డ్రామా ‘పళ్లిచట్టంబి’. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా, చిత్ర యూనిట్ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా కథ మొత్తం 1950ల కాలంలో కేరళలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రూపొందించబడింది. ఇది ఒక కల్పిత కథ అయినప్పటికీ, ఆనాటి సామాజిక,రాజకీయ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించడంలో దర్శకుడు సఫలమయ్యారు. అప్పట్లో కేరళలో ఉన్న ఆచారాలు, అణచివేత, ప్రజల తిరుగుబాటు వంటి అంశాలను ఈ చిత్రంలో చాలా సహజంగా ప్రెజెంట్ చేశారు.
మలయాళంలో విభిన్నమైన పాత్రలు పోషించే టోవినో థామస్, ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తున్నారు. ట్రైలర్‌లో ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉన్నాయి. సినిమా మేకింగ్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయని అర్థమవుతోంది. 1950ల నాటి వాతావరణాన్ని రీ-క్రియేట్ చేసిన సెట్టింగ్స్, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. కేరళ రాజకీయాల్లో చోటుచేసుకున్న మార్పులను, సామాన్యుడి పోరాటాన్ని ట్రైలర్‌లో చాలా ఇంటెన్సివ్‌గా చూపించారు. డిజో జోస్ ఆంటోనీ మేకింగ్ స్టైల్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ‘పళ్లిచట్టంబి’ టీమ్, ఈ సినిమాను ఏప్రిల్ 10న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనుంది.






