‘శ్రీనివాస మంగాపురం’లో కలెక్షన్ కింగ్.. పవర్ ఫుల్ లుక్ విడుదల చేసిన డైరెక్టర్

by Mallepaka Hamsa |

తాజాగా, మోహన్ బాబు మరో ఆఫర్‌ను దక్కించుకున్నారు.ఈ సినిమా నుంచి మూవీ మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

‘శ్రీనివాస మంగాపురం’లో కలెక్షన్ కింగ్.. పవర్ ఫుల్ లుక్ విడుదల చేసిన డైరెక్టర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu)తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా స్పీడ్‌గా దూసుకుపోతున్నారు. ఒకప్పుడు హీరోగా ఒక వెలుగు వెలిగిన ఆయన, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు రెండు క్రేజీ సినిమాల్లో నటిస్తున్నారు. ఇందులో ఒకటి నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాలో మోహన్ బాబు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆయన లుక్ చాలా కొత్తగా, మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతోందని సమాచారం. తాజాగా, మోహన్ బాబు మరో ఆఫర్‌ను దక్కించుకున్నారు.

ఈ సినిమా నుంచి మూవీ మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘శ్రీనివాస మంగాపురం’(Srinivasa Mangapuram) టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అయితే ఈ చిత్రంలో మోహన్‌బాబు వెంకటప్పయ్య నాయుడు పాత్రలో కనిపించబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. మీలాంటి 100% లెజెండరీ నటుడితో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ‘శ్రీనివాస మంగపురం’లోని వెంకటప్పయ్య నాయుడు పాత్ర పట్ల మీ నిబద్ధత సెట్స్‌లో మా అందరికీ స్ఫూర్తినిచ్చింది. సినిమా ప్రపంచానికి మీ శక్తివంతమైన ఉనికిని చూపించడానికి వేచి ఉండలేను’’ అనే క్యాప్షన్ జత చేశారు. కాగా.. ఈ సినిమా ద్వారా సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. అలాగే బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story