Nara Rohit: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ హీరో.. క్లారిటీ ఇస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-05 11:36:28  IST  )

టాలీవుడ్ హీరో నారా రోహిత్(Nara Rohit) ‘సోలో’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు.

Nara Rohit: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ హీరో.. క్లారిటీ ఇస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నారా రోహిత్(Nara Rohit) ‘సోలో’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు. ఈ మూవీ పాజిటివ్ టాక్ సంపాదించుకోవడంతో పాటు ప్రేక్షకులను అలరించింది. ఇక ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయాడు. ఓవైపు హీరోగా నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక గత ఏడాది ‘ప్రతినిధి-2’ (Prathinidhi 2)మూవీతో వచ్చాడు. ఈ సమయంలోనే ఆయన నటి సిరిలెల్లతో ప్రేమలో పడ్డాడు. ఇక కొద్ది రోజుల పాటు ప్రేమించుకున్న వీరు పెద్దల అంగీకారంతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కానీ నారా రోహిత్ తండ్రి మరణంతో పెళ్లి జరగలేదు.

అయితే ఇటీవల నారా రోహిత్ మల్టీ స్టారర్ మూవీ భైరవం(Bhairavam)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మంచు మనోజ్(Manchu Manoj), బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. దీంతో సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న నారా రోహిత్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా, ఆయన రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు.

‘‘అందరి జర్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. నేను ఇంకా ఏం అనుకోలేదు. రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాను అనేది నాకూడా క్లారిటీ లేదు కాబట్టి చెప్పలేను. నేను పాలిటిక్స్‌లో పోటీ చేయాలని మెంటల్‌గా ఫిక్స్ అయినప్పుడు ముందుగా చంద్రబాబుకు చెప్తాను. నేను పాలిటిక్స్‌పై నిర్ణయం తీసుకున్న వెంటనే బాబుగారి దగ్గరకు వెళ్తాను. తర్వాత లోకేష్ అన్నకు చెప్తాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story