స్టేజ్‌పై కన్నీరు పెట్టుకున్న టాలీవుడ్ డైరెక్టర్.. దయచేసి అలా చేయొద్దంటూ రిక్వెస్ట్

by Mallepaka Hamsa |

‘నీది నాది ఒకే కథ’ సినిమాతో తెలుగు ఫిలిమం ఇండస్ట్రీకి దర్శకుడిగా వచ్చిన వేణు ఉడుగుల (Venu Udugula)మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

స్టేజ్‌పై కన్నీరు పెట్టుకున్న టాలీవుడ్ డైరెక్టర్.. దయచేసి అలా చేయొద్దంటూ రిక్వెస్ట్
X

దిశ, సినిమా: ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో తెలుగు ఫిలిమం ఇండస్ట్రీకి దర్శకుడిగా వచ్చిన వేణు ఉడుగుల (Venu Udugula)మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇది బాక్సాఫీసు వద్ద బ్లా్క్ బస్టర్ హిట్‌గా నిలవడంతో దర్శకుడి పాపులారిటీ మరింత పెరిగింది. ఆ తర్వాత చేసిన ‘విరాట పర్వం’ (Virata Parvam)ప్రేమకథగా వచ్చి ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ప్రశంసలు అందుకుంది. సక్సెస్ సాధించనప్పటికీ ప్రశంసలకే పరిమితం అయిపోయింది. ఈ మూవీతో కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చిన వేణు ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju Weds Rambai)మూవీతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. సాయిలు కంపాటి తెరకెక్కించగా.. నవంబర్ 4న విడుదలైంది. రియల్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎంత పెద్ద సక్సెస్‌ను సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో నటించిన వారు కొత్త వారు అయినప్పటికీ మంచి ఓపెనింగ్స్ సాధించడమే కాకుండా సినీ సెలబ్రిటీలతో ప్రశంసలు పొందుతోంది. సక్సెస్‌ఫుల్‌గా థియేటర్స్‌లో రాణిస్తూ.. భారీ కలెక్షన్లు రాబడుతోంది.

ఈక్రమంలో.. తాజాగా, ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా సక్సెస్ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న వేణు స్టేజ్‌పై చాలా ఎమోషనల్ అయిపోయాడు. ‘‘మేము సినిమాను కొంతమందికి చూపించాం. ఒక పెద్ద మనిషిని పిలిచాం. అతనితో పాటు ఒక నలుగురు ఐదుగురు వచ్చారు. ఇంటర్వెల్ అయింది చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారు. ప్రివ్యూ వేస్తే నచ్చలేదని దొంగల్లా మధ్యలో పారిపోయారు. ఒక నిర్మాతకు ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకొటి ఉండదు. బయటకు వెళ్లి నెగెటివ్ ప్రచారం మొదలెట్టారు. వాడు డైరెక్టర్ కాదు.. సినిమా తీయడానికే రాదు అన్నారు. కానీ జనాలు మా చిత్రాన్ని గుండెల్లో పెట్టుకున్నారు. మేము గెలిచామని ఈ మాటలు చెప్పడం లేదు. ఎవరు ప్రివ్యూకి పిలిచినా వెళ్లండి.. కానీ దయ చేసి మీకిష్టం లేకపోతే మధ్యలో రాకండి.

సాయిలు నాకు సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి వల్ల పరిచయం అయ్యాడు. స్వచ్ఛమైన మట్టి మనిషి అలా అడుగుతుంటే నా గుండె తరుక్కుపోయింది. ఒకరోజు షాపింగ్‌కు వెళ్లినప్పుడు ఎక్కువ రేటు బట్టలు చూసి కూడా షాక్ అయ్యాడు. ఇతనిలో నన్ను నేను చూసుకున్నాను. ఈ రోజు నేను చెబుతున్నాను బాగా గుర్తు పెట్టుకోండి. కొన్ని సంవత్సరాలు పోతే తెలుగులో ఫిలిం ఇండస్ట్రీలో వెట్రిమారన్, రంజిత్ ఆ స్థాయిలో సాయిలు కంపాడి ఉంటాడు’’ అని చెప్తూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story