- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ బ్యూటీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
బుల్లితెర సీరియల్ ‘చిన్నారి పెళ్లి కూతురు’ తో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న అవికా గోర్(Avika Gore) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, సినిమా: బుల్లితెర సీరియల్ ‘చిన్నారి పెళ్లి కూతురు’ తో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న అవికా గోర్(Avika Gore) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు నటనపై ఆసక్తితో ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు తెలుగు, హిందీ సినిమాల్లో నటించిన ఆమె హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది. తెలుగులో పలు హిట్స్ కూడా సాధించి తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను దక్కించుకుంది. చివరగా ఈ అమ్మడు ‘షణ్ముఖ’(Shanmukha) సినిమాతో అలరించింది. ఇదిలా ఉంటే.. తాజాగా, అవికా గోర్ తన ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరికీ షాకిచ్చింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టడంతో అది చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.
గత కొద్ది కాలంగా మిలింద్ చంద్వానీ(Milind Chandwani)తో ప్రేమలో ఉన్న ఏడడుగులు వేసేందుకు సిద్ధపడింది. ఈ మేరకు.. ఇన్‌స్టాలో ఫొటోలు షేర్ చేస్తూ ‘‘ఆయన నోరు తెరిచి అడగ్గానే.. నేను సంతోషంతో ఏడ్చాను. ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నట్లుగా అవును అని గట్టిగా అరిచేశాను. పూర్తిగా సినిమాల్లో మునిగినందున.. నాకు మైండ్‌లో మంచి బీజీఎమ్ వినిపిస్తోంది. స్లో మోషన్‌లో మా కల నెరవేరినట్లు కనిపిస్తోంది. అతడేమో ప్రశాంతంగా ఉన్నాడు. తెలివిగా కనిపిస్తున్నాడు. అయినా మేమిద్దరం జంటగా ఫిట్టయ్యాం.
ఎప్పుడైతే అతను నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడో అప్పుడే నాలో ఉన్న హీరోయిన్ నన్ను పూర్తిగా ఆవహించింది. గాల్లో తేలిపోయాను. కళ్లనిండా నీళ్లు.. మెదడు ఆలోచించడమే మానేసినట్లు.. ఇలా రకరకాలుగా అనిపించింది. నిజమైన ప్రేమంటే ఇదే కదా. ప్రేమలో అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చు. కానీ అందులో ఉన్నా మ్యాజిక్కే వేరు’’ అని రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.






