- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభాస్-హను రాఘవపూడి చిత్రంలో టాలీవుడ్ నటుడు.. కన్ఫర్మ్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఫౌజి’.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఫౌజి’. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాగా రూపుదిద్దుకుంటోంది. అయితే ఇందులో ప్రభాస్ సరసన ఇమాన్వి(imanvi) హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ అనుపమ్ ఖేర్(Anupam Kher), మిథున్ చక్రవర్తి కీలక పాత్రలో కనిపించనున్నారు. డిఫరెంట్ స్టోరీ, భారీ బడ్జెట్‌తో మూవీ తెరకెక్కుతుండగా.. షూటింగ్ మొదలు కాకముందే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. అయితే ఈ మూవీలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు. 1940వ దశకంలో జరిగే కథగా మాతృభూమి ప్రజలకు న్యాయాన్ని అందించడానికి ఓ యోధుడు చేసే పోరాటంగా వాస్తవ సంఘటనలతో తెరకెక్కనుంది. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఇందులో కీలక పాత్రలో రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశాడు. ‘‘ఈ విషయం రివీల్ చేయవచ్చా లేదా అనేది నాకు తెలియదు. నేను మాత్రం హను రాఘవపూడి(Hanu Raghavapudi) సినిమాలో నటిస్తున్నాను. అందుకోసమే ఈ లుక్‌ను కొనసాగిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. కాగా, రాహుల్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఇందులో టాలీవుడ్ స్టార్ బ్యూటీ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతుండగా.. దీనిని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్స్‌లోకి రాబోతుంది.






