Today Akkineni Akhil Birthday: ఇవాళ ‘ఏజెంట్’ అఖిల్ బర్త్ డే

by Dishafeatures2 |
Today Akkineni Akhil Birthday: ఇవాళ ‘ఏజెంట్’ అఖిల్ బర్త్ డే
X

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జునల నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అఖిల్. ఏడాది వయసులోనే సిసింద్రీ అనే సినిమాలో నటించి రికార్డు సృష్టించాడు. తండ్రి అక్కినేని నాగార్జున నిర్మాణంలో 1994లో వచ్చిన సిసింద్రీ మూవీతో బెస్ట్ చైల్డ్ అర్టిస్ట్ గా అవార్డు తీసుకున్నాడు అఖిల్. అనంతరం పలు సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని అఖిల్ పుట్టిన రోజు ఈ రోజు (ఏప్రిల్ 8). అక్కినేని నాగార్జున, అక్కినేని అమల దంపతులకు 1994 ఏప్రిల్ 8న అఖిల్ జన్మించాడు. అక్కినేని నాగ చైతన్య అఖిల్ కు అన్న అవే విషయం తెలిసిందే. 2016లో జీవీకే మనవరాలు శ్రియా భూపాల్ తో అఖిల్ కు నిశ్చితార్థం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల వీరి వివాహం రద్దైంది.

ఇవి కూడా చదవండి: Today Allu Arjun Birthday: బన్ని అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ..!


అఖిల్ సినీ కెరీర్..

అయితే ఆ తర్వాత చాలా కాలం పాటు చదువు కోసం గ్యాప్ తీసుకున్నాడు. అనంతరం 2015లో ‘అఖిల్’ మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు అఖిల్. ఈ సినిమా ఆశించినంతా నడవకపోయినా అఖిల్ యాక్టింగ్ కు మాత్రం ఫుల్ మార్కులు పడ్డాయి. ఇక 2017లో వచ్చిన హలో, 2019లో వచ్చిన మిస్టర్ మజ్ను సినిమాలు అంతగా ఆడలేదు. అనంతరం 2021లో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీతో అఖిల్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీలో అఖిల్ సరసన బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే నటించింది. మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా పండింది. ప్రస్తుతం అఖిల్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘ఏజెంట్’ మూవీలో నటిస్తున్నాడు. 2014లో అక్కినేని కుటుంబంలోని మూడు తరాల నటులు నటించిన విక్రమ్ కుమార్ హిట్ ఫ్యామిలీ డ్రామా మనంలో అఖిల్ అతిథి పాత్రలో కనిపించాడు.




Today Allu Arjun Birthday: బన్ని అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ.



Next Story

Most Viewed