- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ సారి చదరంగం కాదు.. రణరంగమే.. క్యూరియాసిటీ పెంచుతున్న ‘బిగ్‌బాస్-9’ ప్రోమో
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ షో పలు సీజన్లు పూర్తి చేసుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది.

దిశ, సినిమా: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ షో పలు సీజన్లు పూర్తి చేసుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఇప్పటికే 8 సీజన్లను పూర్తి చేసుకుని తదుపరి సీజన్‌కు రెడీ అవుతోంది. త్వరలోనే ‘బిగ్‌బాస్-9’ (Bigg Boss-9)ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సారి కామన్ పీపుల్ కూడా ఈ షోలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ క్రమంలో.. తాజాగా, మేకర్స్ బిగ్‌బాస్ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో వెన్నెల కిషోర్ హౌస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమవగా.. నాగార్జున పెట్టిన కండీషన్స్‌కు షాక్ అవుతాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌కు కింగ్‌ని అమ్మాయిలకు మన్మధుడిని అంటాడు. దీంతో నాగార్జున ఈ సారి డబుల్ హౌస్.. డబుల్ డోస్ అని అందరిలో ఆసక్తిని పెంచారు. అంతేకాకుండా బిగ్‌బాస్‌నే మార్చేశాను.. సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా రాబోతున్నారు. ఈ సారి హౌస్‌లో చదరంగం కాదు.. రణరంగమే అని చెప్పారు. దీంతో ఈ షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా? అని అంతా ఎదురుచూస్తున్నారు.






