నా కెరీర్‌లోనే ఇది అతిపెద్ద సవాలు.. ‘లోకా-2’ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన టోవినో థామస్

by Mallepaka Hamsa |

నా కెరీర్‌లోనే ఇది అతిపెద్ద అత్యంత కష్టమైన సవాలు. ఒకే సినిమాలో ఇన్ని వందల పాత్రలను ఎలా చూపిస్తామో నాకే కచ్చితంగా తెలియదు.

నా కెరీర్‌లోనే ఇది అతిపెద్ద సవాలు.. ‘లోకా-2’ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన  టోవినో థామస్
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ తన అప్ కమింగ్ మూవీ 'లోక 2' గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన వెల్లడించిన విషయాలు వింటుంటే, ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, భారతీయ తెరపై ఒక అద్భుతమైన ప్రయోగం అని అర్థమవుతోంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టోవినో తన మనసులోని మాటను బయటపెట్టారు. ఈ సినిమాలో టోవినో ఏకంగా 389 విభిన్న రూపాల్లో కనిపించాల్సి ఉంటుందట. దీనిపై ఆయన స్పందిస్తూ.. "నా కెరీర్‌లోనే ఇది అతిపెద్ద అత్యంత కష్టమైన సవాలు. ఒకే సినిమాలో ఇన్ని వందల పాత్రలను ఎలా చూపిస్తామో నాకే కచ్చితంగా తెలియదు. వాటన్నింటినీ కేవలం పరిచయం చేయడానికే ఒక మూవీ సరిపోతుంది.

ఆ పాత్రలన్నీ చూపించేసరికి సినిమా అయిపోవచ్చు, అందుకే అసలు కథను పూర్తి చేయడానికి మాకు 'లోక 3' కూడా అవసరం కావచ్చు" అని తనదైన శైలిలో వివరించారు.ప్రస్తుతానికి ఈ మూవీ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని, దీనిపై దర్శకుడు డొమినిక్ అరుణ్‌తో నిరంతరం చర్చలు జరుపుతున్నామని టోవినో తెలిపారు. ఇప్పటికే 2025లో వచ్చిన 'లోక: చాప్టర్ 1' పెద్ద హిట్ అవ్వడంతో, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగంలో పౌరాణిక జీవి అయిన 'కల్లియంకట్టు నీలి'గా చంద్ర గుర్తింపు బయటపడటంతో కథ ముగిసింది. ఇప్పుడు రెండో భాగంలో టోవినో 389 పాత్రలతో ఆ మిస్టరీని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. ఈ భారీ బడ్జెట్ సినిమా నిర్మాణం 2026 డిసెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story