తమన్నా స్థానంలో డ్యాన్స్ చేయడంపై క్రిష్టల్ డిసౌజా రియాక్షన్ ఇదే.. ఆసక్తికర కామెంట్స్ వైరల్!

by Mallepaka Hamsa |

రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)హీరోగా నటించిన ‘ధురంధర్’ (Dhurandhar)భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

తమన్నా స్థానంలో డ్యాన్స్ చేయడంపై క్రిష్టల్ డిసౌజా రియాక్షన్ ఇదే..  ఆసక్తికర కామెంట్స్ వైరల్!
X

దిశ, సినిమా: రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)హీరోగా నటించిన ‘ధురంధర్’ (Dhurandhar)భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీసు వద్ద పలు రికార్డులు బ్రేక్ చేసిన ఈ సినిమా ఎంతోమంది ప్రశంసలు పొందుతూ.. దూసుకుపోతుంది. అయితే ఇందులో ‘శరరత్’ సాంగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ పాటలో ముందుగా తమన్నాను అనుకున్నారట మేకర్స్. కానీ ఆమె స్థానంలో క్రిస్టల్ డిసౌజా(Crystal D'Souza), అయేషాఖాన్ కలిసి డ్యాన్స్ చేసి అందరికీ చెమటలు పట్టించారు. తాజాగా, ఈ చాన్స్ దక్కించుకోవడంపై క్రిస్టల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తమన్నా చేసి ఉంటే ఎలా ఉండేదో చెప్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘తెర వెనక జరిగిన విషయాలు నాకు తెలీదు కానీ ఈ పాటలో అయేషాఖాన్‌తో డ్యాన్స్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

తమన్నా గొప్ప నటి. చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. ఒకవేళ ఈ పాట ఆమె చేసి ఉంటే.. ఇంకా అద్భుతంగా ఉండేది. ఆమెను చూసి ఇండస్ట్రీలో ఎంతోమంది మహిళలు గర్వపడుతున్నారు. కానీ ఈ అవకాశం నాకు లభించినందుకు.. మనకు రాసి ఉన్నదే మన సొంతమవుతుందని నేను నమ్ముతున్నాను. ఈ పాట నాకు రాసిఉంది కాబట్టి నేను చేశాను. ఇండస్ట్రీలో హీరోయిన్స్ అందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ.. ముందుకుపోవాలని నేను కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చింది. కాగా.. ‘ధురంధర్’ సినిమా 21రోజుల్లోనే రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరి చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకూ.. రూ. 1,064 కోట్లు వసూలు చేసింది. యానిమల్, కల్కి ఏడీ, పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల రికార్డ్స్‌ను బ్రేక్ చేసి అత్యధివ వసూళ్లు చేసిన సినిమాగా నిలిచింది.

Next Story