‘మిరాయ్’ సినిమాపై అల్లు అర్జున్ రియాక్షన్ ఇదే.. వైరల్‌గా మారిన ఆసక్తికర ట్వీట్

by Mallepaka Hamsa |

తేజ సజ్జా (Teja Sajja)పాన్ ఇండియా సినిమా ‘మిరాయ్’ (Mirai)బాక్సాఫీసును షేక్ చేస్తున్న విషయం తెలిసిందే.

‘మిరాయ్’ సినిమాపై అల్లు అర్జున్ రియాక్షన్ ఇదే.. వైరల్‌గా మారిన ఆసక్తికర ట్వీట్
X

దిశ, సినిమా: తేజ సజ్జా (Teja Sajja)పాన్ ఇండియా సినిమా ‘మిరాయ్’ (Mirai)బాక్సాఫీసును షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అలాగే ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు భారీ కలెక్షన్స్ సాధిస్తూ పలు రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈక్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీల మనసులు గెలుచుకుంటూ ప్రశంసలు సైతం పొందుతూ థియేటర్స్‌లో కొనసాగుతోంది. తాజాగా, ‘మిరాయ్’ సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ప్రశంసలు కురిపిస్తూ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టాడు.‘‘మిరాయ్ బృందానికి అభినందనలు. దృఢ నిశ్చయంతో అద్భుతంగా రూపొందించారు. సోదరుడు తేజ సజ్జా మీ కృషి, అంకితభావానికి గౌరవం. ఇలాంటి సినిమాను నిర్మించిన ఘనత మీకే సొంతం.

ఇందులో నటించిన నటీనటులంతా అద్భుతంగా చేశారు.ఈ సినిమా సాంకేతిక ప్రతిభ. అన్ని సాంకేతిక నిపుణుల పని, ముఖ్యంగా CG బృందాలు, కళ, మిక్సింగ్ గౌరి హారిక హృదయపూర్వక సంగీతం ప్రశంసనీయం. దర్శకుడు చాలా ప్రశంసనీయమైన పని చేశారు. కొత్త తరం వాణిజ్య దర్శకుడికి మార్క్ కొట్టేశారు. మొత్తం ‘మిరాయ్’ బృందానికి అభినందనలు’’ అని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా.. మంచు మనోజ్, జగపతి బాబు, జయరామ్, శ్రియా శరన్ కీలక పాత్రలో కనిపించి మెప్పించారు.

link

Next Story