నా సినిమాను కాపీ కొట్టి ‘ఓజీ’ తీశారు.. దుమారం రేపుతున్న డైరెక్టర్ కామెంట్స్!

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-22 08:15:25  IST  )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ‘ఓజీ’(OG).

నా సినిమాను కాపీ కొట్టి ‘ఓజీ’ తీశారు.. దుమారం రేపుతున్న డైరెక్టర్ కామెంట్స్!
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ‘ఓజీ’(OG). సుజీత్ (Sujeeth)దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదలై బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. అంతేకాకుండా వరల్డ్ వైడ్‌గా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమా కోసం ఇన్నాళ్లుగా ఎదురుచూసిన అభిమానుల ఆకలి తీర్చింది. ఇందులో సీన్స్, మ్యూజిక్ ‘ఓజీ’ మూవీకి హైలెట్‌గా నిలిచాయి. ప్రేక్షకుల ఆదరణ పొందడంతో పాటు సెలబ్రిటీలను కూడా మెప్పించింది. ఇలాంటి సినిమాను కాపీ చేశారంటూ కన్నడ డైరెక్టర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

కన్నడ డైరెక్టర్ ఆర్. చంద్రు(R. Chandru) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేసి ట్రోల్స్‌కు గురయ్యారు. ‘‘నేను 2023లో రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా ‘కబ్జా’ అనే సినిమాను స్ఫూర్తిగా తీసుకుని ‘ఓజీ’ తీశారు. చాలా వరకు సీన్స్ నా మూవీని పోలి ఉంటాయి’’ అని అన్నారు. ప్రస్తుతం చంద్రు కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. ఫ్లాప్ అయిన సినిమాతో పోల్చడమే కాకుండా.. హిట్ అయిన ‘ఓజీ’ గురించి అలా మాట్లాడటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అతని తప్పు తెలుసుకుని పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు.

READ MORE .....

ర‌వితేజ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సురేంద‌ర్ రెడ్డి భారీ ప్లాన్‌..!

Next Story